కుష్టు వ్యాధిపై అపోహలొద్దు | - | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధిపై అపోహలొద్దు

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

● తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలి

● డీఎంహెచ్‌ఓ కళ్యాణ్‌ చక్రవర్తి

● సరూర్‌నగర్‌లో అవగాహన ర్యాలీ

హుడాకాంప్లెక్స్‌: కుష్టు వ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ కళ్యాణ్‌చక్రవర్తి అన్నారు. కుష్టువ్యాధి నివారణ వారోత్సవాల సందర్భంగా గురువారం సరూర్‌నగర్‌ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యాధి లక్షణాల గుర్తింపు, చికిత్స, నివారణను వివరించాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదని తెలిపారు. కుష్టు నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement