● కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
● సంబంధిత అధికారులకు శిక్షణ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోయే ఫేజ్– 2 జనాభా గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనాభా గణనకు సంబంధించిన విధివిధానాలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, నిర్ణీత సమయంలో గణన పూర్తిచేయడం తదితర అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, డీఆర్‌ఓలు శారదదేవి, మాలతి తదితరులు పాల్గొన్నారు.


