ప్రియుడి మృతిని జీర్ణించుకోలేక యువతి | - | Sakshi
Sakshi News home page

ప్రియుడి మృతిని జీర్ణించుకోలేక యువతి

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

శంషాబాద్‌: ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆర్‌జీఐఏ పీఎస్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ సంజీవులు తెలిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం డివిజన్‌ మంచాలకు చెందిన బూర నర్మద(19) శంషాబాద్‌ సిద్దేశ్వర కాలనీలోని అక్క ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలిలో సూసైడ్‌నోట్‌ లభ్యమైంది. తాను ప్రేమించిన నిర్మల్‌కు చెందిన సిద్దార్థ్‌ బేజానిగౌడ్‌ 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని.. అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement