వేర్వేరు ఘటనల్లో నలుగురి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో నలుగురి బలవన్మరణం

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఒంటరితనాన్ని భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపిన ప్రకారం.. ఆలకుంట అలియల్‌ వడి అంబన్న(23) కుర్మల్‌గూడ రాజీవ్‌గృహకల్పలో నివసిస్తున్నాడు. భార్య మూడు నెలల క్రితం బిడ్డకు జన్మనివ్వడంతో పుట్టింటికి వెళ్లింది. నాటి నుంచి ఒంటరితనాన్ని భరించలేని యువకుడు ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున చుట్టుపక్కల వారు వెళ్లి తలుపుతట్టగా లేవకపోవడంతో బద్దలు కొట్టారు. ఉరేసుకుని కనిపించడంతో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి సరమంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టుకు ఉరేసుకుని ప్రైవేట్‌ ఉద్యోగి

షాబాద్‌: ఉరేకుసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని నాగరకుంట గ్రామానికి చెందిన చిర్ర సునీల్‌(21) ప్రైవేట్‌ ఉద్యోగి. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన సునీల్‌ రాత్రైనా తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతుకుతుండగా సోమవారం ఉదయం నాగరకుంట శివారు తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. షాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కడుపునొప్పి భరించ లేక..

మంచాల: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కసరమోని యాదయ్య(55) ఉదయం ఇంట్లో భార్య, పిల్లలు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పరిశీలించగా విగతజీవిగా వేలాడుతున్నాడు. కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య తెలిపింది. మృతుడికి ఇద్దరు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement