ప్రభుత్వం స్పందించి
న్యాయం చేయాలి
లక్డీకాపూల్: తాతల కాలం నుంచి సాగు చేస్తూ వస్తున్న భూములు మావేనని నిరూపించకోవాల్సి రావడం విచారకరమని మహేశ్వరం మండలం కొంగరకుర్దు(ఏ) గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం మీడియా ఎదుట వాపోయింది. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు శ్రీరాములు, రాజ్‌కుమార్, ప్రమీల, సుశీల మాట్లాడారు. గ్రామ పరిధిలోని 384 నుంచి 386, 388 నుంచి 394 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 18 ఎకరాల భూమి ఇనాం ద్వారా తమ ముత్తాత రామయ్యకు సంక్రమించిందని తెలిపారు. నాటి నుంచి ఐదు తరాలుగా ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. 2007లో సదరు భూమి వక్ఫ్ స్థలమంటూ వివాదం చెలరేగగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపిన కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ భూమి తమదంటూ కొందరు వ్యక్తులు ప్రకటించుకోవడం, పత్రికల్లో వార్తలు రావడం చూసి విస్తుపోయామన్నారు. ప్రభుత్వం స్పందించి ఇతరుల భూములను కాజేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ దస్తావేజులు సృష్టించి సర్వే నంబర్ 32లోని భూములను లాక్కునేందుకు కొందరు యత్నిస్తున్నారని ఇదే గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి, పన్నాల యాదిరెడ్డి, సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈవిషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. అక్రమార్కులతో కుమ్మకై ్కన రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఈ దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
కొంగరకుర్దు(ఏ) బాధిత రైతుల విజ్ఞప్తి
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో
మీడియా సమావేశం


