షాబాద్: భూ వివాదంలో ఇద్దరిపై దాడి చేసిన నలుగురి నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులో ఈనెల 25వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో భూ వివాదం నేపథ్యంలో తొంట వెంకటేశ్, తొంట చిన్న రాములు పై గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ దాడిలో వెంకటేశ్, చిన్న రాములు తీవ్రంగా గాయపడ్డారు. భూ వివాదం కారణంగా నిందితులు నర్సింలు, పెద్ద రాములు, అభిషేక్, అఖిల్‌లు దాడికి పాల్పడిన్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు షాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి సోమవారం చేవెళ్ల కోర్టులో హాజరుపచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
పంటల నమోదు తప్పనిసరి
మండల వ్యవసాయాధికారి
దండెం విజచయంద్ర
షాబాద్: రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయయంద్ర పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని తాళ్లపల్లిలో క్షేత్రస్థాయిలో ఏఈఓ శివకుమార్ డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించారు. ఈ నెల 30వ తేదీవరకు పంటల నమోదు చేసుకోవాలని సూచించారు. పంటల నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల ఉత్పత్తులను (పత్తి, మొక్కజొన్న) కందులు, వరి, ఇతర పంటలు) కొనుగోలు చేస్తుందన్నారు. రైతులందరూ పొలాల వద్ద అందుబాటులో ఉండి సరైన పంట వివరాలను తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.
చెల్లని చెక్కు.. ఏడాది జైలు
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో కొత్తపేటకు చెందిన దుర్గాకాంత్‌ఝాకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బిక్కం రజిని తీర్పు చెప్పారు. ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన కుక్కెరగడ్డ విజయకుమార్ వద్ద దుర్గాకాంత్ 2022 మార్చిలో రూ.8 లక్షల అప్పుతీసుకోగా, తిరిగి అదే ఏడాది ఆగస్టులో చెక్కు జారీ చేశాడు. కానీ ఖాతాలో లోపాలతో చెక్కు బౌన్స్ అయింది. ఈమేరకు విజయకుమార్ దాఖలు చేసిన కేసు విచారించి, దుర్గాకాంత్‌కు ఏడాది జైలుశిక్ష విధించడమే కాకుండా ఫిర్యాదుదారుడికి రూ.8లక్షలు లక్షలు చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు
ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో చోరీ
యాలాల: ఇంట్లో ఎవరూలేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన పట్టణ శివారులోని గౌతమి పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చందర్ నాయక్ ఎప్పటి లాగే సోమవారం విధులకు వెళ్లారు. అతని భార్య కుట్టు నేర్చుకునేందుకు బయటికి వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారంతో పాటు రూ.70 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన మహిళ తాళాలు విరిగి ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల వారితో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాలాల పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు అనుమానం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


