దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి(బీవీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్‌ రూ.6వేలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని, మహిళా శిశు సంక్షేమ శాఖను వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. లేదంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీవీహెచ్‌పీఎస్‌ గౌరవ సలహాదారులు బండి శ్రీనివాస్‌, జస్టిస్‌ పార్టీ రాష్ట్ర స్పోక్స్‌ పర్సన్‌ చిత్తలూరు వేణుగౌడ్‌, సోషల్‌ జస్టిస్‌ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీవీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement