వలస కూలీ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వలస కూలీ అదృశ్యం

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

చేవెళ్ల: కూలి చేసుకునేందుకు చేవెళ్లకు వలస వచ్చిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా పానగల్‌ గ్రామానికి చెందిన గువ్వల అగ్గరయ్య, భార్య మంజుల(27) చేవెళ్లకు వలస వచ్చారు. మున్సిపల్‌ కేంద్రంలో వికారాబాద్‌ రోడ్డు సమీపంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం టిఫిన్‌ తీసుకుని వస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదు. సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఉపాధ్యాయుడి దుర్మరణం

యాచారం: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మస్కు సంతోశ్‌కుమార్‌(30) చౌదర్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో తన బైక్‌పై ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గ మధ్యలో యాచారం–చౌదర్‌పల్లి రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యాచారం గ్రామస్తులు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement