శంకర్‌పల్లి: జన్వాడ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన పూర్ణానంద, గ్రీన్‌ఫీల్డ్ వెంచర్లలో గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ‘సాక్షి’దినపత్రిలో ‘నిబంధనలు నిల్.. వెంచర్లు ఫుల్’శీర్షికన ప్రచురితమైన కథనానికి నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్, హెచ్‌ఎండీఓ అధికారులు స్పందించి ఈ నెల 7వ తేదీన ఈ రెండు వెంచర్లలో కూల్చివేతలు చేపట్టిన విషయం విదితమే. కానీ వారం రోజులుగా వెంచర్ యాజమాన్యం ఎవరికి తెలియకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే విషయమై జన్వాడ వాసులు నార్సింగి మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అనుమతులు లేవని కూల్చివేతలు చేపట్టిన అధికారులు వెంచర్‌లో నిర్మాణాలు చేపడితే ఎందుకు పట్టించుకోవడం లేదని.. ముడుపులు ముట్టడంతోనే ముక్కున వేలేసుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్ణానంద, గ్రీన్‌ఫీల్డ్ వెంచర్లలో కొనసాగుతున్న పనులు
ముడుపులు ముట్టడంతోనే ముక్కున వేలేసుకున్నారంటూ ఆరోపణలు


