యాచారం: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు ప్రాంత సమీపంలోని గురుజాల గ్రామానికి చెందిన చిలుకూరి విజయ్‌కుమార్ (25) మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లడానికి మంగళవారం ఉదయం బైక్‌పై తుక్కుగూడ నుంచి సాగర్ హైవే మీదుగా బయలుదేరాడు. మార్గ మధ్యలో గునుగల్ గేట్ సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటినుంచి వెళ్లిపోయిన విద్యార్థి
మహేశ్వరం: కాలేజీకి సక్రమంగా వెళ్లాలంటూ తండ్రి మందలించడంతో డిగ్రీ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ కుమారుడు మహ్మద్ గౌస్ (17) శంషాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా సక్రమంగా కాలేజీకి వెళ్లడం లేదు. ఈ క్రమంలో సరిగ్గా కశాశాలకు వెళ్లి, మంచిగా చదువుకోవాలని ఈనెల 21న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన గౌస్ నమాజ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయమై అతని తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని సూచించారు.
షాద్‌నగర్‌రూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామానికి చెందిన సన్గోముల కృష్ణారెడ్డి (58) చటాన్‌పల్లి పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫాంలో కోళ్లకు వ్యాక్సిన్ వేసేందుకు బుధవారం పనికి వెళ్లాడు. పౌల్ట్రీ ఫాంలోని వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ సమస్య ఉండటంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వైర్లను సరి చేయాలని వ్యవసాయక్షేత్రం పర్యవేక్షకుడు నర్సింలు సూచించాడు. దీంతో వైర్లను సరి చేసేందుకు వెళ్లిన కృష్ణారెడ్డి ప్రమాదవశాత్తు షాక్‌కు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాలుడికి రిమాండ్
పరిగి: బాలికను వేధించిన బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో బాలికను ఓ బాలుడు అతని స్నేహితులు వేధించారు. ఈ నెల 22న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడితోపాటు సహకరించిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండల్‌రెడ్డి తెలిపారు.
హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
పరిగి: హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా విధించినట్లు ఎస్పీ స్నేహ మెహ్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బ్యాగరి కమల(35) గ్రామంలో ఆశవర్కర్‌గా పనిచేస్తూ కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన రావులగల్ల దేవదాసుతో పరిచడం ఏర్పడింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవ జరింది. దీంతో దేవదాసు కోపం పెంచుకున్నాడు. 2016 సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి మద్యం తాగి కమల ఇంటికి వచ్చాడు. ఆమైపె కిరోసిన్ పోసి ని ప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమో దు చేసి దేవదాసును రిమాండ్‌కు తరలించారు. జిల్లా సెషన్ కోర్టు జడ్జి ప్రదీప్‌నాయక్ కేసులో సాక్షాలు, ఆధారాలను పరిశీలించి బుధవారం తీర్పు ఇచ్చారు. నిందితునికి జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.


