రేవంత్‌ రెడ్డి భరతం పడతా | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి భరతం పడతా

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

కొడంగల్‌లో అడుగు పెడతా..

అనంతగిరి: బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతోనే యాత్ర చేపట్టినట్లు టీఆర్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీల జీవితాల్లో మార్పు రావాలంటే రాజకీయ అధికారంలో వారి భాగస్వామ్యం పెరగాలన్నారు. గోల్కొండ కోట నుంచి ప్రారంభమైన పాదయాత్ర బుధవారం వికారాబాద్‌ పట్టణానికి చేరుకుంది. మార్గమధ్యలో పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలు, వసతు ల గురించి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. పేద కుటుంబాలకు భూమి, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన వైద్యం అందాలంటే మార్పు అవసరమన్నారు. పలు వర్గాలకు చెందిన వారి వద్ద కోటి ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. రేపటి బీసీ రాజ్యంలో పేదలకు భూములు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు కులగణనలో బీసీల లెక్కలు తప్పుగా ఉన్నందున ఆ పత్రాలను తగబెడితే సీఎం తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. బీసీలు కేవలం ఓట్లు వేసే వర్గంగా మిగిలిపోకూడదన్నారు. నిర్ణయాలు తీసుకునే స్థానాల్లోకి రావాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భూమి, మన విద్య, మన వైద్యం గురించి నిర్ణయించే రాజకీయ అధికారంలో మన వాటా ఉండాలి అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో ఎదురైన అడ్డంకులను ప్రస్తావించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగకుండా కోర్టులో కేసు వేసి అడ్డుపడ్డారని మండిపడ్డారు. 2028లో బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నది తమ రాజకీయ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌ బంధారపు నర్సయ్య గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ గౌస్‌, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తులు, బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఎనభై ఏళ్లుగా అధికారం రెడ్లు, వెలమల చేతుల్లోనే..

2028లో బీసీ ముఖ్యమంత్రిని చేసి తీరుతాం

టీఆర్‌పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement