అక్రమ మైనింగ్‌ను అడ్డుకోండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌ను అడ్డుకోండి

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

కేంద్రం నిధులను సకాలంలో వినియోగించాలి

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

అనంతగిరి: జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని దాన్ని అడ్డుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మైనింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీబీజీరామ్‌జీ, ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన పనుల్లో నాణ్యత తప్పని సరిగా ఉండాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, పూర్తయిన డబుల్‌ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. జిల్లాలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలకు సంబంధించి భూసేకరణ నివేదికలు ఇవ్వాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని తెలిపారు. గ్రామాల్లో నీటి సమస్యలు ఉండొద్దన్నారు. సమావేశంలో తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు మనోహర్‌ రెడ్డి, యాదయ్య, కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్లు ఉమాశంకర్‌ ప్రసాద్‌, వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూరు, జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, డీఎఫ్‌ఓ విశాల్‌ బత్తుల, దిశా కమిటీ సభ్యులు వడ్ల నందు, మిట్ట పరమేశ్వర్‌ రెడ్డి, జానకిరామ్‌ నాయక్‌, బీ లలిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement