పట్టుదలతో ఏదైనా సాధ్యమే | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో ఏదైనా సాధ్యమే

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

అనంతగిరి: శారీరక లోపం ఎదుగుదలకు అడ్డు కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రితో సదరం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి దివ్యాంగునికి సదరం సర్టిఫికెట్‌ అందేలా చూడాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూరు, కౌన్సిలర్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబోద్‌ కుమార్‌, డాక్టర్‌ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

గణనాఽథులను దర్శించుకున్న స్పీకర్‌

వికారాబాద్‌ పట్టణంలో ప్రతిష్ఠించిన పలు గణనాథులను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆయన వెంట పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.

శారీరక లోపం ఎదుగుదలకు అడ్డు కాదు

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement