ఇక్కడ శాంపిల్స్‌ సేకరణ.. అక్కడ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ శాంపిల్స్‌ సేకరణ.. అక్కడ పరీక్షలు

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

ఇక్కడ శాంపిల్స్‌ సేకరణ.. అక్కడ పరీక్షలు

మొయినాబాద్‌: మొయినాబాద్‌ పీహెచ్‌సీకి వచ్చినవారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ అందుబాటులో లేరు. ఏఎన్‌ఎం రక్త నమూనాలు సేకరించి వికారాబాద్‌కు పంపి అక్కడ పరీక్షలు చేయిస్తున్నారు. రిపోర్ట్స్‌ వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతుందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్‌, అల్ట్రాసౌండ్‌, మూత్ర పరీక్షలు చేసే సౌకర్యాలు లేవు. ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్‌ మూడు నెలల క్రితం మరో చోటుకి బదిలీ కావడంతో ఇక్కడ పోస్టు ఖాళీగా ఉంది. ఆరు బెడ్‌ల ఉన్న ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. మరో డాక్టర్‌ డిప్యూటేషన్‌పై మరో చోట పనిచేస్తున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ (పీహెచ్‌ఎన్‌) పోస్టు సైతం ఖాళీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement