యాచారం: మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి సోమవారం విషజ్వరాలు, కాళ్లు, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, వాంతులు, విరేచనాలతో దాదాపు 250 మందికి పైగా రోగులు వచ్చారు. విషజ్వరాలు సోకిన వారికి రక్త నమూనాలు సేకరించి కొండాపూర్ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఫలితాలు వచ్చే వరకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి. ఉదయం 10 గంటలకు వచ్చిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపోయారు. రక్త పరీక్షలకు కావాల్సిన పరికరాలు లేకపోవడంతో రోగులు యాచారం, ఇబ్రహీంపట్నం, మాల్‌లోని ప్రైవేట్ ల్యాబ్స్‌కు వెళ్లాల్సి వస్తోంది.


