ముగిసిన పద్య తోరణం వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పద్య తోరణం వేడుకలు

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

ఇబ్రహీంపట్నం: వినోభానగర్‌లోని సాధన కుటీర్‌లో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్‌ నిర్వహించిన జిల్లా స్థాయి పద్య తోరణం వేడుకలు సోమవారంతో ముగిసాయి. 27 మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పద్యాల ఉచ్చారణ, భావం రాగయుక్తంగా పఠించడం వంటి అంశాల్లో విద్యార్థులు కనబరిచిన నైపుణ్యం ఆకట్టుకుంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తరగతుల వారీగా ఎంపిక చేసి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎస్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు సదా వెంకట్‌ మాట్లాడుతూ.. మాతృభాష పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రముఖ సాహితీవేత్త దోరవేటి చెన్నయ్య మాట్లాడుతూ వినడం, చదవడం ద్వారనే నిజమైన జ్ఞానం లభిస్తుందని మన పూర్వీకులు ఆచరించి చూపారన్నారు. జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రముఖుడు కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మాతృభాష వికాసం, మాతృదేశంపై భక్తి భావాన్ని పెంపొందించడంలో పద్యాల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఎస్‌జీహెచ్‌ఎంఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్‌, ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు, గోపాల్‌, వెంకటస్వామి, టి.ఆశీర్వాదం, కమలేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement