ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు స్టాఫ్ నర్సులు మాత్రమే ఉదయం 9 గంటలకు కనిపించారు. 10.30 గంటలకు సూపర్ వైజర్ వచ్చారు. అప్పటికే ఓ బాధితుడు కాళ్లు, చేతులు, కడుపు వాచిపోయిందని వచ్చి ఆస్పత్రి ముందే పడుకున్నాడు. ఇదేంటి ఇలా పడుకున్నావని అడగ్గా వైద్యులు రాలేదని వాపోయాడు. బిహార్‌కు చెందిన మహిళ ప్రెగ్నెంట్ టెస్టు కోసం రాగా నర్సులు కిట్లు లేవని.. రక్త పరీక్షలు మాత్రమే చేస్తామని చెప్పారు. అదేమిటని ‘సాక్షి’ ప్రశ్నించగా గతంలో కిట్లు లేక పరీక్షలు చేయలేదని.. ప్రస్తుతం వచ్చాయని అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం గమనార్హం.


