రేకులషెడ్డులో పరీక్షిస్తున్న వైద్యులు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా అప్‌గ్రేడ్ చేశారు. పాత ఆస్పత్రి భవనాన్ని కూల్చి కొత్తగా నిర్మిస్తుండటంతో వైద్య సేవలకు ఇబ్బందులు తప్పడంలేదు. తాత్కాలికంగా పాత మున్సిపల్ కార్యాలయ భవనంలోకి మార్చడం, అక్కడి ఖాళీ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్‌లో రోగులకు చికిత్సలు అందిస్తుండటంతో తిప్పలు తప్పడంలేదు. ఇటు రోగులు, అటు వైద్య సిబ్బందికి ఏమాత్రం సరిపోడం లేదు. నిత్యం ఆస్పత్రికి సుమారు 450 నుంచి 500 మంది చికిత్స నిమిత్తం వస్తున్నారు. వైద్యసిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నా సరైన భవనం లేక ఇబ్బంది పడుతున్నారు. శాంపిల్స్ కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు.


