కడ్తాల్: మైసిగండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల కేంద్రానికి వెళ్లడంతో నలుగురు నర్సింగ్ సిబ్బంది రోగులను పరీక్షిస్తూ కనిపించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కొంతమంది డాక్టర్ కోసం వేచి చూశారు. ఆలస్యం కావడంతో నర్సింగ్ సిబ్బందిని కలిసి పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన డాక్టర్ అప్పటివరకు వేచి ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ జూన్‌లో రిటైర్ కావడంతో అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్‌కు ఒకరు డిప్యూటేషన్‌పై లేమూర్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, ఒక్కరు మాత్రమే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ సెలవుపై వెళ్లారు.


