అధికారుల సహకారంతో అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

అధికారుల సహకారంతో అక్రమ రవాణా

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

యాలాల: కాకరవేణి నది నుంచి ఇసుక రవాణా నిలిపివేయాలని లేదంటే భారీ ఆందోళన చేపడతామని కాకరవేణి–కాగ్నా పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పట్టపగలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇసుక తరలింపు చేపడుతున్న వ్యక్తులు చూపే యాప్‌, పర్మిట్లు అబద్దమని.. ఈ విషయం టీజీఎండీసీ ఉన్నతాధికారుల వద్ద తేటతెల్లమైంద ఐక్యవేదిక సభ్యుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఇటీవల రెవెన్యూ, మైన్స్‌, ఇతర జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాల్లో అమ్ముకున్న వారితో పాటు వారికి సహకరించిన అఽధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ అనంతయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ మెట్లి ఆశన్న, కృష్ణకుమార్‌, రైతులు రవికుమార్‌, గణేశ్‌, బాయిమీది అశోక్‌, మల్లేషం, జీవీ రెడ్డి తదితరులు ఉన్నారు.

నకిలీ యాప్‌లు.. పర్మిట్లతో ఇసుక తరలింపు

అడ్డుకోకుంటే ఆందోళన చేపడతాం

కాకరవేణి–కాగ్నా పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement