చేవెళ్ల: ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. సీపీఐ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్(19) మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈనెల 18న తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు వెళ్లాడు. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే గతంలో కూడా సమీర్ ఇలాగే వెళ్లిపోయి సుమారు మూడు నెలల పాటు మన్నెగడూలోని ఓ మదర్సా హాస్టల్‌లో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తల్లి ఫాతిమా సోమవారం చేవెళ్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ క్లినిక్ సీజ్
హయత్‌నగర్: డాక్టర్ లేకుండా మరో వ్యక్తి వైద్యం చేస్తుండగా తనిఖీలు చేపట్టిన జిల్లా వెద్యారోగ్య శాఖ అధిరులు సోమవారం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌ను సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హయత్‌నగర్ పాత రోడ్డులోని అజయ్ క్లినిక్ డాక్టర్ సరిత పేరుతో రిజిస్టర్ అయిఉంది. రిజిస్ట్రేషన్ ముగియడంతో ఆమె రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులు రాకుండానే ఆమె పేరుతో అర్హత లేని మరో వ్యక్తి వైద్యం చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. డెమో గంగసాని మంజుల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యరత్న, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక తమ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. వెంటనే క్లినిక్‌ను సీజ్ చేసి, సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ముగిసిన
అల్లరాయప్ప జాతర
దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇండాపూర్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న అల్లరాయప్ప జాతర సోమవారం ముగిసాయి. సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందరెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, సర్పంచ్ వెంకటయ్య, నాయకులు సంతోశ్, భీములు తదితరులున్నారు.


