ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

మొయినాబాద్‌: రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని యువజన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మొయినాబాద్‌లో యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందన్నారు. యువజన కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టాలన్నారు. ఈ నెల 29న నగరంలోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించే గిగ్‌ వర్కర్ల సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి ఖాలీద్‌, సహాయ ఇన్‌చార్జి భవ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు లక్ష్మికాంత్‌, శ్యాంచరణ్‌రెడ్డి, మహిపాల్‌యాదవ్‌, మహేశ్‌గౌడ్‌, సికిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

జక్కిడి శివచరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement