ప్రజా సంక్షేమానికి కేంద్ర పథకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికి కేంద్ర పథకాలు

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

అర్హులందరూ

సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో

ఈషా సెంటర్‌ ప్రారంభం

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతోందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈషా డిజిటల్‌ సేవా కేంద్రాన్ని (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకుని సులభంగా పొందవచ్చన్నారు. పేదల కోసం 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, సోలార్‌ విద్యుత్‌, ముద్ర రుణాలు, రైతులకు ఫసల్‌ బీమాయోజన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను పొందాలన్నారు. ఆయుష్మాన్‌ భారత వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. డిజిటల్‌ సేవా కేంద్రాల ద్వార సంక్షేమం ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొక్క నర్సింహ్మారెడ్డి, బోసుపల్లి ప్రతాప్‌, కొప్ప బాష, జక్క రవీందర్‌రెడ్డి, దొండ రమణారెడ్డి, బూడిద నర్సింహ్మారెడ్డి, దన్నే బాషయ్య, ఎన్ను యాదగిరిరెడ్డి, తాండ్ర రవీందర్‌, విజయనాయక్‌, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement