కళరిపయట్టు కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

కళరిపయట్టు కమిటీ ఎన్నిక

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

కొడంగల్‌ రూరల్‌: కళరిపయట్టును బలోపేతం చేసే దిశగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన జాతీయ సంస్థ ఇండియన్‌ కళరిపయట్ట ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అసోసి యేషన్‌ అవిర్భవించిందని పేర్కొన్నారు. లింగంపల్లి టీజేఆర్‌ స్టేడియంలో సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షురాలిగా శ్రీమతి ఎం.మహదేవ్‌, కార్యదర్శిగా టి.రమేష్‌ (కొడంగల్‌), సంయుక్త కార్యదర్శిగా రాఘవ్‌ముకుంద్‌, కోశాధికారిగా డాక్టర్‌ ఆది భవానీశంకర్‌ బాధ్యతలు చేపట్టారని అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. తెలంగాణలో కళరిపయట్టుకు బలమైన పునాది ఏర్పాటుచేసి, నిరంతర అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement