గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు చర్యలు

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

కొందుర్గు: గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఏసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం ఆయన జిల్లేడ్‌ చౌదరిగూడ పోలీసుస్టేషన్‌ను సందర్శించి, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. పోలీసు స్టేషన్‌ ప్రస్తుత ప్రైవేట్‌ భవనం శిథిలావస్థలో ఉందని, విషపూరిత కీటకాలు వస్తున్నాయని సిబ్బంది వివరించగా.. మరోచోట అనుకూలమైన భవనంపై చర్చించారు. అదేవిధంగా నూతన భవన నిర్మాణానికి సంబంధించిన స్థలం విషయమై మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసు, ఎస్‌ఐ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏసీపీ లక్ష్మీనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement