రేపు నేత్రోనిలనం
ఖైరతాబాద్: శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిగా కొలువుదీరనున్న ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మట్టితో రూపుదిద్దుకుంటున్న మహాగణపతికి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. 14న వినాయక చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి సంపూర్ణంగా తయారై భక్తులకు దర్శనమిచ్చేలా పనులు వేగిరం చేశారు. విగ్రహానికి శుక్రవారం కంటి పాప (నేత్రోనిలనం) అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు 12 రోజుల పాటు 9 రకాల ప్రసాదాలను అందజేస్తామని బుధవారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు తెలిపారు.


