చోరీ సొత్తు రికవరీ | - | Sakshi
Sakshi News home page

చోరీ సొత్తు రికవరీ

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

అనంతగి: దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ చేస్తామని అడిషనల్‌ ఎస్పీ రాజేష్‌ మీనా అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర దొంగ వికాస్‌ సింగ్‌ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మణికంఠ నగర్‌ కాలనీలో మే ఒకటో తేదీ రాత్రి ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురైంది. కేసు విచారణ చేపట్టిన జిల్లా సీసీఎస్‌, వికారాబాద్‌ టౌన్‌ పోలీసులు జూన్‌ 4న వికాస్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు బయటికి వచ్చాయి. వికాస్‌ సింగ్‌పై వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 7 కేసులు, పరిగి పీఎస్‌ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ కేసులకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌ జిల్లా కుడువర్‌ పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో తన తల్లి ద్వారా తనఖా పెట్టిన సుమారు 25 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అశోక్‌ కుమార్‌ సోనీ, వికాస్‌ అగ్రహారి తదితరుల బంగారం దుకాణాల నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన డీఎస్పీ అంజయ్య, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బల్వంత్‌ రాయ్‌, వికారాబాద్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘుకుమార్‌ను ఎస్పీ అభినందించారు.

అంతర్రాష్ట్ర దొంగ వికాస్‌ సింగ్‌ కేసులో పురోగతి

యూపీలో 25 తులాల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన అడిషనల్‌ ఎస్పీ రాజేష్‌ మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement