మహేశ్వరం: రాఖీ పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు మహేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపడంతో లాభం వచ్చిందని డిపో మేనేజర్ లక్ష్మీ సుధ తెలిపారు. డిపోలో మొత్తం 80 వరకు బస్సులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో డిపోలో ప్రతిరోజు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం వచ్చేది. రక్షాబంధన్ సందర్భంగా పండుగ రోజు, మరుసటి రోజు కలిపి ఒక్కోరోజు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజులకు కలిపి రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు అదనంగా ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ తెలిపారు.


