రద్దీకి అనుగుణంగా..
షాద్‌నగర్: షాద్‌నగర్ డిపో నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపించారు. గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 3,03, 239 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఫలితంగా సంస్థకు రూ.1.59 కోట్లకుపైగా సమకూరింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ రూట్లతో పాటు పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లలో స్పెషల్ బస్సులు నడిపి ఆదాయం గడించారు.
మహాలక్ష్ముల ప్రయాణం
రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పండగ సందర్భంగా ఐదు రోజుల్లో సుమారు రెండు లక్షల మందికిపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. గత నెల 28న పండగ రోజు సుమారు 45వేల మంది ప్రయాణం సాగించడంతో ఆ ఒక్కరోజే రూ.35.39 లక్షల ఆదాయం వచ్చింది.
అదనపు ట్రిప్పులు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. సిబ్బంది బస్టాండ్‌లోనే మకాం వేసి రద్దీకి అనుగుణంగా బస్సులు నడిచేలా చర్యలు చేపట్టారు. అదనపు ట్రిప్పులను నడిపించారు. డ్రైవర్లు, కండక్టర్లు అధికారులు సిబ్బంది పండుగ రోజు సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వామ్యమై సంస్థకు ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు.
రాఖీ వేడుక ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.. ఐదురోజుల పాటు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.. బస్టాండ్లలో ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ కనిపించారు.. ఆయా రూట్లలో అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపించారు.. ఖజానాకు కాసుల వర్షం కురిసింది.
కాసులు కురిపించిన రక్షాబంధన్
లక్షల్లో బస్సుల్లో ప్రయాణం
ఐదురోజుల పాటు కిటకిట
డిపోలకు భారీగా ఆదాయం
రాఖీ పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపించాం. మూడు లక్షలకు మందికి పైగా బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా డిపోకు రూ.1.59 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
– కరుణశ్రీ, డిపో మేనేజర్, షాద్‌నగర్


