ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నండిపోకు ఒక్క రాఖీ వేడుక రోజే రూ.39.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యం డిపోకు రూ.32 లక్షలు వస్తుండగా పండుగ రోజు అదనంగా రూ.7.50 లక్షల వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణం ద్వారా రూ.25.50 లక్షలు రాగా నగదు రూపంలో సుమారు రూ.14 లక్షలు సమకూరింది. పండుగ రోజు పది సర్వీసులు ప్రత్యేకంగా తిరిగాయి. 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించారు. మాల్ నుంచి మహాత్మగాంధీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రూట్లలో ఆదాయం ఎక్కవగా వచ్చింది. రాఖీ పర్వదినం ముందు రోజు రూ.4 లక్షలు, పండుగ మరుసటి రోజు రూ.3.60 లక్షలు, సోమవారం రూ.5 లక్షలు వచ్చాయి. రాఖీతోపాటు ఆదివారం పట్నంలో బోనాల ఉత్సవాలు ఉండటంతో ఆర్టీసీకి అదనంగా ఆదాయం సమకూరింది.
అదనంగా ఆదాయం
రాఖీ పండుగ రోజు 1.60 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులు సుమారు లక్ష మంది ఉన్నారు. డిపోకు రూ.39.50 లక్షల ఆదాయం రాగా అదనంగా రూ.7.50 లక్షలు సమకూరింది. గత గురువారం నుంచి సోమవారం వరకు అదనంగా రూ.20 లక్షల ఆదాయం వచ్చింది. – సుజాత, డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం


