అండర్‌–15 ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అండర్‌–15 ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

ఇబ్రహీంపట్నం: సుబ్రతో ముఖర్జీ అండర్‌–15 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడా పోటీలు ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠం్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో రా ష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల జట్లు పాల్గొంటున్నా యి.జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ డా.రామచంద్రుడు పోటీలను ప్రారంభించారు. విజేతలకు శనివారం బహుమతి ప్రధానోత్సవం చేస్తారు. గెలిచిన జట్టు బెంగళూరులో నిర్వహించే జాతీ య స్థాయి పోటీలకు వెళ్లనున్నట్లు నిర్వాహకు లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీడీ అండ్‌ పీఈ టీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ సాబేర్‌, గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎంఆర్‌పీఎస్‌ మహాసభను జయప్రదం చేయాలి

మొయినాబాద్‌: వరంగల్‌లో సెప్టెంబర్‌ 9న జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్‌మాదిగ అన్నారు. మొయినాబాద్‌లో శుక్రవారం ఎంఆర్‌పీఎస్‌, అనుబంధ విభాగా ల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూళన, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదల, మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నా రు. సెప్టెంబర్‌ 5 లోపు అన్ని గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేసి 9న జాతీయ మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం మండల మాజీ అధ్యక్షుడు మ హేందర్‌, ఎంఎస్‌పీ జిల్లా మాజీ అధ్యక్షుడు బా బుమాదిగ, జిల్లా మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌రావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కందుకూరు: భారత్‌ ఫ్యూచర్‌సిటీ కందుకూరు మండలం పంజగూడ రెవెన్యూలో ఉన్న ప్రభు త్వ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లో సెప్టెంబర్‌ 1నుంచి స్వల్పకాలిక సాంకేతిక కో ర్సులు ప్రారంభించనున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపా ల్‌ వి.లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను అందించేందుకు ఆధునిక యంత్రాలు, పరికరాలతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్వల్పకాలిక కోర్సులైన మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఎంఈవీ),ఇండస్ట్రీల్‌ రోబోటిక్స్‌,సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్నీషియన్‌లో శిక్షణ ఉంటుందన్నారు. పదో తరగతి లేదా ఐటీఐఉత్తీర్ణులైన వారు, పా లిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. రోబోటిక్స్‌, సీఎన్‌సీ, ఈవీ విభాగాల్లో ఆధునిక పరికరాలతో ప్రత్యక్ష ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుందన్నారు.కోర్సు పూర్తి కాగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పాఠ్యాంశాలతో శిక్షణ ఇస్తామన్నారు. ప్రవేశాల కోసం ట్రైనింగ్‌ అధికారి అజయ్‌కుమార్‌ను 74164 75164 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

గంజాయి పట్టివేత

శంకర్‌పల్లి: గంజాయి విక్రయించేందుకు వచ్చి న వ్యక్తిని మోకిల పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సురేశ్‌ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్‌ మండల్‌ (42) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఒడిశాలో కొనుగోలు చేసిన ఎండు గంజాయిని జన్వాడలోని కార్మిక ప్రాంతాల్లో విక్రయించేందుకు గురువారం బైక్‌పై వచ్చాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జన్వాడ గేట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. జగన్నాథ్‌ నుంచి రెండు కిలోల 80 గ్రాముల ఎండు గంజాయి, బైక్‌, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement