ప్రజలపై భారం మోపేలా కేంద్రం విధానాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలపై భారం మోపేలా కేంద్రం విధానాలు

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

తుర్కయంజాల్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని.. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోందని సీపీఐ జిల్లా కార్య దర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. పార్టీ చేప డుతున్న ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం తుర్కయంజాల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య అధ్యక్షతన యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జంగయ్య మాట్లాడుతూ.. దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర లభించడం లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా పరీక్షల నిర్వహణలో వరుసగాప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో కేంద్రం లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందు కు ప్రజలు ముందుకు రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దత్తు నాయక్‌, బీఎంకేయూ జిల్లా కార్యదర్శి ప్రభులింగం, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్‌ రెడ్డి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, నాయకులు ఈదులకంటి అనురాధ, విజయ, రోజా రాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement