చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ (35) చేవెళ్లలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో పామెన బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న శ్రీనివాస్‌కు తీవ్ర గ్రాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. మృతుడిని గుండాలకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నాగోలు: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీపాతి దీపారెడ్డి పార్థివదేహం ఆదివారం చంపాపేట డివిజన్ శిఖరా ఎన్‌క్లేవ్ కాలనీలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక కాలనీవాసులు భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, సంక్షేమ సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం చంపాపేట రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఆమన్‌గల్ మున్సిపల్ చైర్మన్ పత్యానాయ పాల్గొన్నారు.


