ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓలు, ఈసీలు, టీఏ, సీఓ సమ్మెలో పాల్గొంటే తాము విధుల్లో ఉన్నామని తెలిపారు. సమ్మెతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దానయ్య, బాల్‌రాజ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.


