క్షీణిస్తున్న ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్షీణిస్తున్న ఆరోగ్యం

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

క్షీణిస్తున్న ఆరోగ్యం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. నిద్రలేమి.. వెరసి జిల్లావాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. చిన్న వయసులోనే పెద్ద రోగాలకు కారణమవుతోంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే రిపోర్టు–2023–24లోని గణాంకాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. 15 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల ఆరోగ్యంపై సర్వే నిర్వహించింది. 2019–21 నివేదికలోని గణంకాలతో పోలిస్తే.. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న బాధితుల సంఖ్య 2023–24లో మరింత పెరిగినట్లు పేర్కొంది. ఆరోగ్యం విషయంలోనే కాదు.. పురుషులకు తామేమాత్రం తీసిపోమన్నట్లు మహిళలు సైతం స్మోకింగ్‌, ఆల్కాహాల్‌కు బానిసవుతున్నారు. వీరి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 17.1 శాతం మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నట్లు తేలింది. గతంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య 3.1 శాతం పెరిగినట్లు గుర్తించింది.

మధుమేహంతో బాధపడుతున్న మహిళలు

అంశం 2019–21 2023–24

బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌–హై (141–160ఎంజీ) 5.2 7.7

బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌–వెరీ హై (160ఎంజీపైగా) 8.3 10.1

నియంత్రణ కోసం మందులు వాడుతున్నవారు 15.3 18.7

మధుమేహంతో బాధపడుతున్న పురుషులు

అంశం 2019–21 2023–24

బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌–హై (141–160ఎంజీ) 6.3 7.2

బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌–వెరీ హై (160ఎంజీపైగా) 11.0 13.8

నియంత్రణ కోసం మందులు వాడుతున్నవారు 22.9 19.6

రక్తపోటుతో బాధపడుతున్న మహిళలు

అంశం 2019–21 2023–24

సాధారణ రక్తపోటు (140–159 ఎంఎం ఆఫ్‌ హెచ్‌జీ) 14.6 7.6

అధిక రక్తపోటు (160 ఎంఎం ఆఫ్‌ హెచ్‌జీ) 7.9 6.9

నియంత్రణ కోసం మందులు వాడుతున్నవారు 28.5 22.7

రక్తపోటుతో బాధపడుతున్న పురుషులు

అంశం 2019–21 2023–24

సాధారణ రక్తపోటు (140–159 ఎంఎం ఆఫ్‌ హెచ్‌జీ) 21.3 11.9

అధిక రక్తపోటు (160 ఎంఎం ఆఫ్‌ హెచ్‌జీ) 9.3 11.7

నియంత్రణ కోసం మందులు వాడుతున్నవారు 35.0 28.7

ధూమపానం, మద్యం అలవాటు

ధూమపానం అలవాటు ఉన్న మహిళలు 4.5 4.5

ధూమపానం అలవాటు ఉన్న పురుషులు 18.9 17.8

మద్యం అలవాటు ఉన్న మహిళలు 6.7 12.9

మద్యం అలవాటు ఉన్న పురుషులు 46.8 49.9

షుగర్‌ కొడుతోంది

హైలెవల్‌

మధుమేహం, రక్తపోటు గుప్పిట్లో జిల్లావాసులు

మద్యం, ధూమపానం అలవాటు

పురుషులకు ఏమాత్రం తీసిపోని మహిళలు

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–2023–24 నివేదికలో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement