ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ బడంగ్‌పేట్‌: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌, ఎస్సీ డీడీ ఆధ్వర్యంలో నాదర్‌గుల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జె.రామారావు, గౌరవ డైరెక్టర్‌ బి.జనార్దన్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు హాస్టల్‌ సౌకర్యం ఉంటుందన్నారు. అభ్యర్థుల డిగ్రీ మార్కుల (మెరిట్‌) ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు ఉంటుందన్నారు. 11న మెరిట్‌ లిస్ట్‌ ప్రదర్శన, 12 నుంచి శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు 10వ తరగతి, ఇంటర్‌ మెమో, డిగ్రీ మెమో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు దరఖాస్తు చేసుకున్న ఫారం జిరాక్స్‌లు జతపరిచి బడంగ్‌పేట జీహెచ్‌ఎంసీలోని నాదర్‌గుల్‌లో (ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఎదురుగా, ఎస్సీ హాస్టల్‌ భవనం) నేరుగా సమర్పించాలని సూచించారు. వెంకయ్యనాయుడికి సన్మానం మొయినాబాద్‌రూరల్‌: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మేడిపల్లి రెవెన్యూ పరిధిలోని తన ఫామ్‌హౌస్‌కు శనివారం వెంకయ్యనాయుడు వచ్చిన విషయం తెలుసుకుని నాయకులతో కలిసి వెళ్లి సన్మానించారు. సన్మానించిన వారిలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ యాదయ్య, మాజీ సర్పంచ్‌ నవీన్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు వెంకటేశ్‌, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్‌ హబ్‌ పనుల పరిశీలన

కొడంగల్‌: దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారులో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనుల పురోగతిని అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ శనివారం పరిశీలించారు. వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కళాశాలలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌, ఏటీసీ, సైనిక్‌ స్కూల్‌, వెటర్నరీ కళాశాల, 430 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌, డీఈ రాజయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement