● అద్దాలు పగులగొట్టి.. పలువురిని రక్షించి | - | Sakshi
Sakshi News home page

● అద్దాలు పగులగొట్టి.. పలువురిని రక్షించి

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● అద్దాలు పగులగొట్టి.. పలువురిని రక్షించి

అనంతగిరి: కళ్ల ముందే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తక్షణమే స్పందించిన ముగ్గురు యువకులు సహాయక చర్యలకు దిగారు. బస్సు అద్దాలు పగులగొట్టి అందులోనుంచి క్షతగాత్రులను బయటకి తీసి వారి ప్రాణాలు కాపాడారు. ఒకరిపై ఒకరు పడి ఉండగా ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటకు లాగారు. రియాజ్‌, సద్దాం అనే యువకులు మొక్కజొన్నలు విక్రయిస్తారు. ముస్తఫా ఆటో నడుపుతాడు. ఘటన జరిగిన వెంటనే వీరు చూపిన మానవతా హృదయానికి మరికొందరు తోడయ్యారు. పలువురుని రక్షించగలిగారు. వీరి ధైర్య సాహసాలను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించి శాలువాలతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement