కేటీఆర్‌కు కృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు కృతజ్ఞతలు

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

కేటీఆర్‌కు కృతజ్ఞతలు

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాదిరెడ్డి తమ్ముడు ఓంరెడ్డి కూతురు భవితకు గొంతులో టాన్సిల్స్‌ సమస్య ఉండటంతో నెల రోజుల క్రితం శస్త్రచికిత్సకోసం కేటీఆర్‌ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భవితకు శస్త్రచికిత్స చేశారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో సోమవారం యాదిరెడ్డి కుటుంబ సభ్యలు, మాజీ మంత్రి సబితారెడ్డితో కలిసి నగరంలోని కేటీఆర్‌ నివాసానికి వెళ్లారు. ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కొత్త మాణిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement