నాణ్యమైన వైద్యసేవలు
చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు
జిల్లాలోని వనస్థలిపురం, కొండాపూర్ సహా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాల ఔట్‌పేషంట్ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ (వనస్థలిపురం) ఆస్పత్రిలో బయటి రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపైంది. రోగుల నిష్పత్తి మేరకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం కమ్యూనిటీ సెంటర్లలోనూ రద్దీ పెరిగింది. 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దావఖానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల సాధారణ ఓపీల్లో 40 శాతం మంది జ్వర పీడితులే కన్పిస్తున్నారు.
కునుకు లేకుండా చేస్తున్న దోమలు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరి, దోమలకు నిలయంగా మారుతున్నాయి. చిరుజల్లులకు రాత్రిపూట ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట ఇంట్లో నిద్రించే పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా వారు విపరీతమైన జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు.
వీల్ చైర్‌లో తీసుకెళ్లేవారులేక తన భార్యను స్వయంగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్న భర్త
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రద్దీ
వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుతున్నాయి. పారిశుద్ధ్యలోపం, నీటి కాలుష్యం, దోమకాటుతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అనేక మంది దగ్గు, జ్వరం, వంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
– సాక్షి, రంగారెడ్డిజిల్లా
ఆస్పత్రులకు క్యూ కడుతున్న జ్వరపీడితులు యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు కిటకిట
మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో గతంలో ఓపీకి రోజుకు సగటున 500 మంది వస్తే ప్రస్తుతం 1,600 దాటింది. ఇక్కడికి వస్తున్న వారిలో మెజార్టీ బాధితులు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్లే. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టం రెడీగా ఉంది. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చిన వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ


