అంగన్‌వాడీలకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు సన్మానం

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

అంగన్‌వాడీలకు సన్మానం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా మొయినుద్దీన్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఉచిత ప్రయాణం ఎలా ఉంది..?

శంకర్‌పల్లి: ప్రభుత్వం అంగన్‌వాడీలను పట్టించుకోవడం మానేసిందని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం విమర్శించారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు చెప్పడం తప్ప.. చేసిందేమీ లేదన్నారు. అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ప్రతాప్‌రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఫరూఖ్‌నగర్‌ మండలం విఠ్యాల గ్రామానికి చెందిన ఎండీ మొయినుద్దీన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు జాగృతి సంస్థ చైర్‌పర్సన్‌ కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మొయినుద్దీన్‌ మంగళవారం కవితను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ పండగ, దాని విశిష్టత మరగున పడకుండా ప్రపంచానికి చాటి చెప్పేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

కొందుర్గు: కొందుర్గు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నహీద్‌ జహాన్‌ ఎస్‌జీఎఫ్‌ కుంగ్‌ఫూ క్రీడా పోటీల్లో ప్రతిభచూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం గోపీనాథ్‌ మంగళవారం తెలిపారు. 52 కేజీల అండర్‌ –17 విభాగంలో ప్రతిభచూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. నహీద్‌ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థినిని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాజర్‌అలీ, ప్రేమ్‌సాగర్‌, కరాటే మాస్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

● ఆర్టీసీ బస్సులో కాసేపు ప్రయాణం

● మహిళా ప్రయాణికులతో మాటామంతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ‘ఉచిత ప్రయాణం ఎలా ఉంది.. మహాలక్ష్మి పథకం మీద మీ అభిప్రాయం ఏమిటి..’ అంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మహిళా ప్రయాణికులను ఆరా తీశారు. మంగళవారం ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని బొంగ్లూర్‌ సమీపంలో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద ఆయన కాసేపు ఆగారు. అదే సమపంలో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును నిలిపి బస్సెక్కారు. కండక్టర్‌ వద్ద టికెట్‌ తీసుకుని సీట్లో కుర్చొని ఇంజాపూర్‌ వరకు ప్రయాణం చేశారు. పక్కనే ఉన్న మహిళలతో మాట్లాడారు. ఉచిత టికెట్‌ ప్రయాణం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి తిరిగి వెళ్తున్న పలువురు విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement