ప్రభుత్వ వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకం

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

ఇబ్రహీంపట్నం: ప్రజలకు రక్షణ కల్పించడంలో, ప్రభుత్వ వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. టీజీఎస్పీ 3వ బెటాలిలయన్‌ (అక్టోపస్‌) గేట్‌ నుంచి నాగన్‌పల్లి రహదారికి నిర్మించిన అప్రోచ్‌ రోడ్డును, పోలీసు క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం చూపే పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అవుతుందన్నారు. కార్యక్రమంలో 3వ బెటాలియన్‌ కమాండెంట్‌ సయ్యద్‌ జమీల్‌ బాషా, అడిషనల్‌ కమాండెంట్‌ ఎస్‌.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ వీరయ్య, పాండు, శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ అదనపు గదుల ప్రారంభం

ఇబ్రహీంపట్నంలోని గ్రంథాలయంలో రూ.75 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, స్థానిక లైబ్రేరియన్‌ యాదయ్య పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్‌ సవరణ జాబితాపై (సర్‌పై) బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement