యాచారం: అవేర్ మాధవన్‌జీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నందివనపర్తిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అవేర్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ మాధవన్‌జీ మెడికల్ క్యాంపును ప్రారంభించగా, గ్రామానికి చెందిన 200 మంది పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకున్నారు. అనంతరం మాధవన్‌జీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. వైద్యులు ఆషికారెడ్డి, కార్తీక్, చందన్ రోగులకు పరీక్షలు చేశారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ బ్రామ్ వాన్ లూవీన్ గౌరవ్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పి.వరుణ్, మేనేజర్ వెంకన్న, సర్పంచ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


