శంకర్‌పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్‌మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


