ఎస్‌ఎస్‌తాడ్వాయి : ములుగు జిల్లా మేడారం జంపన్న వాగులో బుధవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఘట్‌కేసర్‌కు చెందిన తిమ్మయ్య, మరికొంత మంది మేడారం వెళ్లారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లారు. తిమ్మయ్య తూముల వాగు వద్ద స్నానం చేసేందుకు యత్నించగా పోలీసులు వద్దని హెచ్చరించారు. వారి సూచనలు పట్టించుకోకుండా స్నానం చేస్తుండగా వరద ఉధృతికి గల్లంతయ్యాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
విప్రోకు స్టాప్.. బంజారాకు పెంపు


