● పేపర్ లీక్ బాధ్యులను
కఠినంగా శిక్షించాలి
● సీపీఐ నేతల డిమాండ్
ఇబ్రహీంపట్నం: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. నీట్ లీక్‌తో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాఉద్యమాలు, విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు పి.నీలమ్మ, నాయకులు నర్సింహ్మ, అజయ్, సంతోష్, బిచ్చునాయక్ తదితరులు పాల్గొన్నారు.


