జైల్‌భరోను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

జైల్‌భరోను జయప్రదం చేయండి

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

వ్యవసాయ కార్మిక సంఘం నేతలు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై

మండిపడ్డ నాయకులు

యాచారం: క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఆగష్టు 10న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచంద్రయ్య పిలుపునిచ్చారు. యాచారంలో మంగళవారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిరుపేదలు, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ, వారికి జీవనో పాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ జైల్‌భరోకు పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, యాచారం మండల అధ్యక్ష, కార్యదర్శులు పుష్ప, కావలి జగన్‌, సీఐటీయూ మండల కన్వీనర్‌ చందునాయక్‌, నాయకులు బాల్‌రాజ్‌, తావునాయక్‌, బాషయ్య, ఆంజనేయులు, ఇందిరమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement