మొయినాబాద్: ఇంటి ముందు పార్కుచేసిన బైక్ దగ్ధమైంది. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారానికి చెందిన నాగుల లక్ష్మయ్య సోమవారం రాత్రి రోజు మాదిరిగానే తన బైక్‌ను ఇంటి ముందు పార్కు చేశాడు. అర్ధ రాత్రి బైక్‌కు మంటలు అంటుకుని దగ్ధమవుతుండడంతో స్థానికులు గమనించారు. లక్ష్మయ్య సైతం నిద్రలేచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. దీనిపై బాధితుడు మంగళవారం ఉదయం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మధ్యాహ్నం తిరిగి వెనక్కి తీసుకున్నాడు. బైక్ కీ ఆన్‌లో ఉండడంతో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
వీధికుక్కల దాడిలో
ఐదుగురికి గాయాలు
మర్పల్లి: వీధి కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని మెగిలి గుండ్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన పణ్యమ్మ దుకాణానికి వెళ్తోంది. ఈ క్రమంలో వీఽధి కుక్కలు ఒక్కసారిగా ఆమె మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే మార్గంలో వెళ్తున్న రమేశ్ కుక్కలను బెదిరించేందుకు యత్నించగా ఆయనపైనా దాడి చేయడంతో గాయపడ్డాడు. గ్రామానికి చెందిన బద్రి గుడి నిర్మాణ పనులు చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అదే రోజు రాత్రి మరో ఇద్దరిపై దాడి చేయడంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. వీధి కుక్కల బెడద నివారించా లని పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


