మండల కేంద్రంలో మంగళవారం కురిసిన ఓ మోస్తరు వర్షానికి తహసీల్దార్ కార్యాలయ ముఖ ద్వారం మడుగులా మారింది. గేటు దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్జీలు, ధ్రువపత్రాల కోసం వచ్చిన విద్యార్థులు, యువకులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు నీటిలోనుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. – కడ్తాల్


