మొయినాబాద్: మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కేటాయించిన స్థలాలను వారికే ఇవ్వాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నవించారు. హిమాయత్‌నగర్ గ్రామస్తులు కార్తీక్‌రెడ్డితో కలిసి మంగళవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే 290 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి హిమాయత్‌నగర్ రెవెన్యూలోని సర్వేనంబర్ 151లో స్థలాలు కేటాయించిందని.. అప్పట్లో కోర్టు కేసులతో ఇళ్లు నిర్మించుకోలేకపోయారని వివరించారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని మార్కెట్‌కు కేటాయిస్తున్నారని.. అది పేదలకే ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కలెక్టర్‌కు చెబుతానని.. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, మంజుల, నరోత్తంరెడ్డి, సుధాకర్‌యాదవ్, నాయకులు రవియాదవ్ ఉన్నారు.


