పర్యావరణ స్పృహ అవసరం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ స్పృహ అవసరం

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

కడ్తాల్‌: ప్రతి ఒక్కరికీ పర్యావరణ స్పృహ అవసరమని విశ్రాంత కలెక్టర్‌ ఎం.పురుషోత్తంరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌ సెంటర్‌లో డిపార్ట్‌మెంటల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ – కౌన్సిల్‌ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విధ్యాధికారుల శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. స్వార్థ పూరిత జీవన శైలి కారణంగా ప్రకృతి సంపదలు వేగంగా నశిస్తున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, ప్లాస్టిక్‌ వినియోగం అదుపు తప్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు కేవలం విద్యా సంపదలే కాకుండా ప్రకృతితో సమతుల్యంగా జీవించే జీవన విధానాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీజీఆర్‌ చైర్‌ పర్సన్‌ లీలాలక్ష్మారెడ్డి, ఫౌండర్‌ లక్ష్మారెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్తలు సాయిభాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఈఎల్పీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ యానాల వెంకట్‌రెడ్డి, సుస్థిర పుడమి ఎడిటర్‌ రమేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement